»Tdp Janasena Alliance Will Contest Next Assembly Pollrayapati Sambashiva Rao
Rayapati sambashiva rao:టీడీపీ-జనసేన కలిసి పోటీ.. కన్నా వస్తే అభ్యంతరం లేదు: రాయపాటి
Rayapati sambashiva rao:ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. పొత్తులపై మాత్రం తేలడం లేదు. బీజేపీ- టీడీపీ అని ఒకరు.. బీజేపీ- జనసేన అని మరొకరు.. టీడీపీ- జనసేన అని మరొ నేత కామెంట్ చేస్తున్నారు. అగ్ర నేతలు మాట్లాడుకుంటున్నారు. రాయపాటి సాంబశివరావు మాత్రం టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తాయని అంటున్నారు.
Rayapati sambashiva rao:ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) కూడా జనాల్లోకి వెళ్లారు. నిన్న పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. నారా లోకేశ్ (lokesh) యువగళం పేరుతో పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ (pawan kalyan) వారాహి వాహనంలో రాష్ట్రమంతా పర్యటిస్తారు. పొత్తులపై మాత్రం తేలడం లేదు. బీజేపీ- టీడీపీ అని ఒకరు.. బీజేపీ- జనసేన అని మరొకరు.. టీడీపీ- జనసేన అని మరొ నేత కామెంట్ చేస్తున్నారు. అగ్ర నేతలు మాట్లాడుకుంటున్నారు.. కానీ దీనిపై ఇప్పటివరకు కామెంట్స్ చేయలేదు.
సీనియర్ నేత, మాపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు (Rayapati sambashiva rao) కూడా పొత్తుల గురించి కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన (tdp-janasena) కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. ఇందులో సందేహానికి తావులేదని చెప్పారు. తమతో బీజేపీ (bjp) కలిసి వస్తోందా అని మీడియా ప్రతినిధులు అడిగితే సమాధానం దాట వేశారు. సోము వీర్రాజు (somu verraju) అయితే.. జనసేనతో (janasena) కలిసి పోటీ చేస్తామని అంటున్నారు.
ఇటు రాయపాటి సాంబశివరావు.. (rayapati sambashiva rao) కన్నా లక్ష్మీనారాయణ (kanna laxminarayana) రాజీనామాపై స్పందించారు. ఆయన రాజీనామా విషయం తనకు తెలిసిందన్నారు. కన్నా లక్ష్మీనారాయణతో తనకు వ్యక్తిగత శత్రుత్వం లేదన్నారు. కన్నాను రాజశేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి సపోర్ట్ చేశారని చెప్పారు. పెదకూరపాడులో కన్నాతో కలిసి పోటీ చేశామన్నారు. చేబ్రోలు హనుమయ్య.. కన్నాను ప్రోత్సాహించాడని చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు (chandrababu naidu) ఎవరికి సీటు ఇస్తే వారికి సపోర్ట్ చేస్తానన్నారు రాయపాటి సాంబశివరావు. కన్నా టీడీపీలో చేరితే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. చంద్రబాబు (chandra babu) ఆదేశిస్తే కన్నాతో కలిసి పని చేస్తామన్నారు. ఆయనకు ఉండేది ఆయనకు ఉంటుంది, నాకు ఉండేది నాకు ఉంటుందని రాయపాటి అన్నారు.
గత ఎన్నికల్లో పత్తిపాటి, జి.వి.ఆంజనేయులు, యరపతినేనికి ఆర్దిక సాయం చేశానన్నారు. ఇప్పుడు వాళ్లు మమ్మల్ని పట్టించుకోవడం లేదని రాయపాటి సాంబశివరావు (Rayapati sambashiva rao) గుర్తుచేశారు. ఇక నరసరావుపేట సీటు చదలవాడ అరవింద్ బాబుదేనని (chadalawada aravind babu) చెప్పారు. ఈసారి అరవింద్ బాబు తప్పకుండా నరసరావుపేట ఎమ్మెల్యే అవుతాడని రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు.