మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన కామెంట్లను జాతీయ మహిళ కమిషన్ సభ్యురాలు ఖుష్బూ ఖండించారు. వెంటనే బండారు సత్యనారాయణ రోజాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలోకి వస్తే వైసీపీ అంతుచూస్తామని, రాబోయేది టీడీపీ, జనసేన ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయయాత్రలో భాగంగా ఆయన సీఎం జగన్‌పై, వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు అక్టోబర్ 19వ తేది వరకూ పొడిగిస్తున్నట్లు ఆదేశాలిచ్చింది. దీంతో మరో 14 రోజులు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. అలాగే ఆయన దాఖలు చేసిన బెయిల్, పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.
ఒకప్పుడు రూ.300కు పైగా ధర పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు 30 పైసలకు చేరుకుంది. కనీస ధరను ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఓ కప్పు టీ తాగడానికి కూడా 30 కిలోల టమాటాలు అమ్మాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న టీడీపీ, జనసేన, సీపీఐ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిరసనలో పాల్గొనొద్దని చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేశారని పోలీసులు మొత్తం 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడి అరెస్టును నిరసిస్తూ బాబుకు మద్దతుగా నెల్లూరులో మిత్రపక్షాలు ర్యాలీ చెపట్టారు. అయితే ర్యాలీకి పోలీసుల అనుమతి లేకపోవడంతో జిల్లాలోని కీలక నేతలను గృహనిర్బంధం చేశారు. అధికారుల కళ్లు కప్పి మరి ఎమ్మెల్యే కోటంరెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు.