కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 18న సీఎం జగన్ చేతుల మీదుగా ఇంటి స్థలాలు ఇప్పించనున్నట్లు వెల్లడించారు.
అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు తేరుకునేలోపే క్షణంలో అంతా జరిగిపోయింది. నాటు తుపాకీ పేలడంతో విషాద ఘటన జరిగింది.
ఏపీ మంత్రి రోజాకు జనసేన వీరమహిళ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కంత్రిలా మాట్లాడుతున్నారని, నోరు అదుపులో పెట్టుకోకపోతే కత్తి మహేష్‌కు ఏం జరిగిందో తెలుసు కదా అని విమర్శించారు.
కూల్ బీర్ కావాలని అడిగి గొడవకు దిగాడు హరిబాబు అనే వ్యక్తి. వైన్ సిబ్బంది దాడి చేయడంతో అతని తల పగిలింది. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.
ఏపీలోని విశాఖపట్నం(visakhapatnam)లో ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్ ఐదవ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. సంతానోత్పత్తి చికిత్సల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని క్లినికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి(radhika potluri) అన్నారు.
చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.20 గంటల నుంచి 1.50 గంటల సమయంలో దోపిడికి తెగబడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక పరిధిలో మరో ఐదు చిరుతలు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అవి సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తిరుపతి ఏడో మైలు, నామాలగవి, లక్ష్మినరసింహ స్వామి ఆలయం పరిసరాల్లో అవి తిరుగుతున్నట్లు చెప్పారు. అయితే వాటిని ట్రాప్ చేసిన సీసీ కెమెరాల దృశ్యాల ద్వారా వాటిని గుర్తించినట్లు ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిం...