టీడీపీ నేత నారా లోకేశ్(nara lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా కొనసాగుతుంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్రలో భాగంగా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. యువతకు ఉద్యోగాలు రావాలన్నా మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నా…సైకో పోయి సైకిల్ రావాలని లోకేశ్ వ్యాఖ్యానించారు. నాడు నేడు అంటూ హడావిడి తప్ప అభివృద్ధి ఏం చేయడం లేదని ఆరోపించారు. గతంలో ప్రజలతో మాట్లాడిన సీఎం ...
సొంత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు కేటాయించిన గన్ మెన్లను వెనక్కి పంపించారు. ప్రభుత్వం తనకు భద్రత తగ్గించిన కారణంగా తానే రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నానంటూ కోటంరెడ్డి తనకు గన్ మెన్లు అక్కర్లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఆయన గన్ మన్లు తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. కోటంరెడ్డిని వదిలి వెళ్లలేక కన్నీటిపర్యంతమయ్యారు. కోటంరెడ్డి కూడా చలించిపోయారు. గన్ మెన్ల...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గానికి చేరుకుంది. నేడు లోకేశ్ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయాన్ని సందర్శించారు. వినాయక స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. కాణిపాకం ఆలయంలోని అర్చకులు లోకేశ్‌కు వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలను అందజేశారు. యువగళం పాదయాత్రలో లోకేశ్‌న...
సీఎం జగన్‌పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం ఇచ్చే దమ్ము ఉందా అని సవాల్ విసిరారు. ఆర్థికశాఖలో అసలు ఏం జరుగుతోందో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుసా? అని ప్రశ్నించారు. ఆర్థికశాఖపై పెత్తనం అంతా సీఎం జగన్ దేనని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బహిరంగ మార్కెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంత, చెల్లించిన వడ్డీ ఎంత? అని యనమల ...
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం పదో రోజుకు చేరుకుంది. నేడు పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రి మంగసముద్రంలో బస చేస్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆడ బిడ్డలు క్షేమంగా ఉండేది టీడీపీ పాలనలోనే అన్నారు. జగన్‌కు ఒక్క ఛాన్సు ఇస్తే రాష్ట్రాన్ని ఏ దుస్థితిలోకి తీసుకొచ్చారో చూస్తూనే ఉన్నామని చెప్పారు. పెన్షన్లు తీసేయడం, మద్య...
నంద్యాల జిల్లాలో భూమా అఖిలప్రియ వర్సెస్ ఎమ్మెల్యే రవిచంద్రకిశోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. రవి అక్రమాలు చేశారని అఖిలప్రియ ఆరోపణలు చేయగా.. ఎమ్మెల్యే ధీటుగా స్పందించారు. అక్రమాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని కోరారు. తన ఆస్తుల విలువ పెరిగితే మీకెందుకు బాధ? అని ప్రశ్నించారు. తాను గౌరవంగా, గర్వంగా ఆస్తులు సంపాదించుకున్నానని శిల్ప రవి వివరించారు. తన ఇల్లు, నంద్యాల ఆస్తులకు సంబ...
ఏపీ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గత నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో సివిల్ కానిస్టేబుళ్లతో పాటు ఏపీఎస్పీ కానిస్టేబుల్ నియామకాల కోసం గత ఏడాది నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6500పైగా ఉద్యోగాలను పోలీస్ శాఖలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన...
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటు లేఖ రాశారు. అమర్ నాథ్ రాజకీయాల్లో బచ్చా అంటూ విరుచుకుపడ్డారు.‘‘డియర్ అమర్ నాథ్.. నువ్వు రాజకీయాల్లో బచ్చావి. పైకి రావాల్సిన వాడివి. సాధారణ మంత్రి పదవికి అమ్ముడుపోయి కాపుల భవిష్యత్ నాశనం చేయకు. అనవసరంగా పవన్ పై బురద చల్లటానికి ప్రయత్నం చేయకు. నీ భవిష్యత్ కోరిచెబుతున్నా’’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు...
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎంతో రద్దీగా ఉండే మార్గం హైదరాబాద్ -విజయవాడ రూట్. జాతీయ రహదారిపై 5 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 9 వరకు ఈ ఆంక్షలను విధించారు. సూర్యాపేట సమీపంలోని దురాజ్ పల్లి లింగమతుల స్వామి(పెద్దగట్టు) జాతర సందర్భంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందుకు తగిన సూచనలు, మళ్లింపు మార్గాలను జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సవివరంగా వెల్లడించారు. హైదరాబా...
నెల్లూరు పాలిటిక్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. నిన్న కోటంరెడ్డి భద్రతను ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇద్దరు గన్ మెన్లను రీ కాల్ చేసింది. దీంతో కోటంరెడ్డి ఈ రోజు మళ్లీ మీడియా ముందుకు వచ్చారు. తనకు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు. భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నలుగురిలో ఇద్దరు గన...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితే ఏపీకీ ప్రత్యేక హొదా వస్తుందని ఏపీ పీసీసీ ఛీప్ గిడుగు రుద్రరాజు తెలిపారు. రాహుల్ ప్రధాని అయిన వెంటనే ఆయన పెట్టే తొలి సంతకం ఏపీ ప్రత్యేక హోదా పైలు మీదేనని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో చేయి చేయి కలుపుదాం..రాహుల్ గాంధీని బలుపరుద్దాం కార్యక్రమాన్ని ప్రారింభించారు. అనంతరం ఆయన పలు ప్రాంతల్లో పర్యటించారు. కేంద్ర రాష్ట్...
గత కొన్నిరోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో కాక రేపుతున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఏపీ సర్కార్ భద్రతను తగ్గించింది. ఇప్పటివరకు ఆయనకు 2 ప్లస్ 2 భద్రత ఉండగా ఇప్పుడు దానిని తగ్గించింది. ఇప్పుడది 1 ప్లస్ 1కు ఏపీ సర్కార్ చేసింది. భద్రత తగ్గింపుపై కోటంరెడ్డి కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లు సమాచారం. వైసీపీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన వెంకటగిరి ఎమ్మెల్యే, మాజ...
జగన్ ప్రభుత్వంపై సొంత పార్టీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే అవకాశం ఉందన్నారు. పార్టీలో జగన్ చెప్పినట్లు పడి ఉండాలంటే, ప్రతి ఒక్కరూ ఏదో ఒకరోజు తిరగబడతారని హాట్ కామెంట్స్ చేసారు. పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఓ రూల్, జగన్ కు మరో రూల్ ఉంటుందా అని ప్రశ్నించారు. వైయస్ వివేకా హత్య కేసు గురించి మాట్లాడుతూ… గదిలో రక్తపు మరకలు శుభ్ర...
గన్నవరం విమానాశ్రయంలో వాల్తేరు వీరయ్య సినిమా డైరెక్టర్ సందడి చేశారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన డైరెక్టర్ బాబీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడారు. సినిమా విడుదలై నాలుగు వారాలు గడిచినా కలెక్షన్స్ భారీగా వస్తున్నాయన్నారు. సినిమాని తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా...
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా కొడాలి నాని సంచలన అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్ ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. దీంతో వైసీపీ నేతలు దీటుగా స్పందిస్తున్నారు. లోకేష్ విమర్శలపై స్పందించిన కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. నందమూరి తారక రామారావు మృతిపై విచారణ జరిపించాలని సరికొత్త డిమాండ్ తెరపైకి త...