»In Addition Alluri District Is Inundated By Floods
floods : ఇంకా వరద ముంపులో అల్లూరి జిల్లా .. ఆకలి, దప్పికలకు గిరిజనులు అవస్థలు
ఒక వైపు ఎడతెరిపిలేని వాన, మరో వైపు ప్రళయంలా గోదావరి వరద.. గ్రామాల్లోకి పోటెత్తడంతో గిరిజనులు ప్రాణాలు అరచేత పెట్టుకుని బిక్కుబిక్కుమంటు దయనీయ స్థితిలో ఉన్నారు
ఏపీలో నాలుగైదు రోజులుగా పలు జిల్లాల్లో భారీ వర్షాలుతో అనేక గిరిజన గ్రామాలు (Tribal villages) ఇంకా వరదలు తగ్గలేదు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 40 గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి.ముఖ్యంగా శ్రీరామగిరి, తుమ్మిళేరు, పోతవరం(Potavaram), జీడిగుప్ప, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 300 పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలు కావడం, ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేకపోవటంతో..వరద బాధితులంతా సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని నాలుగు రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు.
ఇక్కడ కరెంట్ సరఫరా (Current supply) లేవకపోవడం, అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, పిల్లలు వృద్ధులు, వికలాంగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం (State Govt) నుంచి కిలో కందిపప్పు మినహ ఏ సహాయం అందలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వరద ముంపు తగ్గినప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఇప్పటికీ ఆయా గ్రామాల్లోని గిరిజనులు కొండలపై ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గూడారాలలోనే తలదాచుకుంటున్నారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలని కోరుతున్నారు.