Fire : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం..90 బైక్ లు దగ్ధం
కాశీబుగ్గలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో షోరూంలో ఉన్న 90 ఎలక్రికల్ బైక్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం.
Fire : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరం జరిగింది. కాశీబుగ్గలో బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ బైక్ షోరూం(Bike showroom)లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ క్షణంలో షోరూంలో ఉన్న వాళ్లంగా ఉన్న ఫళంగా బయటకు పరిగెత్తారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే షాపును మంటలు చుట్టుముట్టాయి. ఈ అగ్ని ప్రమాదం(Fire accident)లో షోరూంలో ఉన్న 90 ఎలక్రికల్ బైక్(Electric bike) లు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఎలక్ట్రిక్ బైక్ కు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం. మంటలు భారీగా ఎగిసి పక్కనే ఉన్న హార్డ్ వేర్ షాపుకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద కారణాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటు పక్క దేశం చైనాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చైనా రాజధాని బీజింగ్(Beijing) లోని ఓ ఆసుపత్రి(hospital)లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చికిత్స పొందుతున్న 21 మంది రోగులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రమాదం నుంచి బయట పడి ప్రాణాలు దక్కించుకునేందుకు రోగులు కిటికీల లోంచి దూకారు.