BPT: గత వైకాపా పాలనలో నిర్వీర్యమైన మున్సిపల్ వ్యవస్థను తిరిగి బలోపేతం చేసి, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గురువారం వెస్ట్ గోదావరి జిల్లాలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.