SKLM: తీరప్రాంతంలో నిత్యం నిఘా ఉంచడంతో పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోస్టల్ సెక్యూరిటీ ఎస్పీ SMV రవివర్మ ఆదేశించారు. శుక్రవారం భావనపాడు మెరైన్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. తుఫాన్ వంటి సమయాల్లో తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.