KDP: జిల్లాలో జరుగుతున్న కేంద్ర పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈనెల 26 నుంచి మూడు రోజుల పాటు జిల్లా పర్యటనకు వస్తున్నారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆకాంక్ష బ్లాకులుగా గుర్తించిన సీకే దిన్నె, జమ్మలమడుగు, పెండ్లిమర్రి మండలాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ప్రగతి నివేదికలను అధికారులు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.