W.G: యువత రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం క్యాంపు కార్యాలయం వద్ద ఆయనను బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన పత్సా గోపాలకృష్ణ కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాజకీయాలకు వన్నె తెచ్చే విధంగా నడుచుకోవాలన్నారు. యువతకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.