GNTR: గుంటూరులో అండర్-14 బాలుర ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ ఆదివారం ప్రారంభమైంది. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు వెంకట్రామయ్య, మల్లికార్జునరావు, ఉదయ్ కిరణ్, సంపత్ రాయుడు, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.