ATP: ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో బెలుగుప్పలోని రెవెన్యూ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆధార్ కేంద్రం దెబ్బతినింది. ఆధార్ కేంద్రంలో ఉన్న లాప్టాప్ , ఇతర వస్తువులు దెబ్బతిన్నాయి. భారీగా నష్టం వాటిల్లిందని బాధితుడు గోవిందరాజులు వాపోయాడు. తనకు నష్టపరిహారం చెల్లించాలని బాధితుడు తహశీల్దార్ అనిల్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు.