కోనసీమ: అమలాపురం మండలం బండారులంక గ్రామానికి చెందిన విద్యార్దిని లక్ష్మీ ప్రసన్న జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో గ్రీన్ బెల్ట్ సాధించింది. ఈ సందర్భంగా ఆమెను ఆదివారం రాత్రి జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.