కృష్ణా: ప్రజా దర్బార్ కార్యక్రమం శనివారం చల్లపల్లిలో ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ఎంఎం ఆనందకుమారి తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 10-30 నుంచి 1-30 వరకు నిర్వహించే ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేయనున్నట్లు తెలిపారు. చల్లపల్లి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.