»Enforcement Directorate Detect Diversion Of 70 Crores Skill Ap Development Scam
Ap development scamలో Rs.70 crores దారి మళ్లాయి: ఈడీ
Ap development scam:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది.
enforcement directorate detect diversion of 70 crores skill ap development scam
Ap development scam:ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో (Ap development scam) రూ.70 కోట్లు (70 crores) దారి మళ్లాయిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. నిధులను స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా నుంచి డిజైన్ టెక్ సిస్టమ్స్.. అక్కడి నుంచి పలు షెల్ కంపెనీలకు తరలించారని వివరించింది. సీమెన్స్ (siemens) ప్రాజెక్ట్‌కు ఇవ్వాల్సిన నిధులను సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, మెటీరియల్, సర్వీసెస్ సప్లై పేరుతో మళ్లించారని పేర్కొంది.
సీమెన్స్ (siemens) మాజీ ఎండీ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ఎండీ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా మాజీ ఫైనాన్సియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, చార్టర్డ్ అకౌంటెంట్ సురేశ్ గోయల్‌ను మనీ లాండరింగ్ (money laundaring) కింద అరెస్ట్ చేశామని తెలిపింది. రాష్ట్రంలోని యువత నైపుణ్యం కోసం సాప్ట్ వేర్ (softwate), టెక్నికల్ స్కిల్స్ (technical skills) కోసం చేపట్టిన కార్పొరేషన్లో వీరు కలిసి కుట్ర పన్నారని పేర్కొంది.
విశాఖపట్నంలో గల పీఎంఎల్ఏ (pmla) కోర్టులో ప్రవేశపెట్టగా.. ఏడు రోజుల (seven days) ఈడీ కస్టడీకి ఇచ్చింది. ఏపీ సీఐడీ (cid) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. ఎంక్వైరీలో నిధుల మళ్లింపు నిజమేనని తేలింది. రూ.70 కోట్లను షెల్ కంపెనీల పేరుతో మళ్లించి.. కాజేశారు. ఇప్పుడు వారంతా ఈడీ కస్టడీలో ఉన్నారు.