కర్నూలు మండలం సీపీఎం నూతన కార్యదర్శిగా పీబీ హుస్సేనయ్య ఎన్నికయ్యారు. మంగళవారం కర్నూలు మండలం గొందిపర్ల గ్రామంలో పార్టీ మూడవ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కమిటీని ఎన్నుకున్నారు. మహాసభలకు హాజరైన ప్రతినిధులు కార్యదర్శిగా హుస్సేనయ్యను, పలువురిని కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు.