SKLM: ఎచ్చెర్ల మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఆదివారం తూర్పు కాపు ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. తూర్పు కాపు సామాజిక వర్గం సంక్షేమానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట రావు, తదితరులు పాల్గొన్నారు.