VSP: జీవీఎంసీ పరిధిలో గల సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నమస్తే’ పథకంలో వెంటనే నమోదు కావాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ మంగళవారం తెలిపారు. సెప్టిక్ ట్యాంక్ కార్మికుల యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ ‘నమస్తే’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు. జోనల్ కార్యాలయాలాల్లో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.