CTR: పలమనేరు ఎస్టేట్లో ఒంటరిగా జీవిస్తున్న రామయ్య అనే వృద్ధుడిని సీఐ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు అమ్మ ఒడి ఆశ్రమానికి తరలించారు. గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అతను ఇప్పుడు తన పనులు చేసుకోలేని స్థితికి చేరుకున్నట్లు CI తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా.. పట్టించుకోకపోవడంతో అమ్మ ఒడి ఆశ్రమానికి తరలించినట్టు వెల్లడించారు.