AKP: నర్సీపట్నం బ్రిటిష్ సమాధుల ప్రాంతంలో అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలుపుదల చేయాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేధిక ప్రధాన కార్యదర్శి ఏ. అజశర్మ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ సమాధుల ప్రాంతాన్ని సందర్శించారు. అల్లూరి పోరాటాలకు ఆనవాళ్లగా ఉన్న ఈ బ్రిటీష్ సమాధుల ప్రాంతాలను కొంతమంది అధికార నాయకులు అండదండలతో ఆక్రమించి అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారన్నారు.