తూ.గో: పాతపట్నం మండలం గంధం సరియా, గురండి గ్రామాల్లో బుధవారం రీ సర్వే కార్యక్రమం రెండవ విడత జరిగింది. గ్రామాలలో రాబోయే రెండు నెలల కాలంలో రైతుల సమక్షంలో భూముల సర్వే నిర్వహిస్తారని తహసీల్దార్ తెలిపారు. అందులో భాగంగా గురండి గ్రామంలో రీ సర్వేపై రైతులకు అవగాహన కల్పించుటకు నిర్వహించిన గ్రామ సభ, ర్యాలీలో టెక్కలి ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి పాల్గొన్నారు.