కృష్ణా: విజయవాడ గాంధీనగర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వంశీతో ములాఖత్ కానున్న నేపథ్యంలో పోలీసులు బారీకేడ్లు పెట్టారు. అయితే మద్యం మత్తులో ఓ వ్యక్తి రాయితో తలపై కొట్టుకున్నాడు. గేట్లు తెరవాలని హల్ చల్ చేశాడు. దీంతో మందు బాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ను చూసేందుకు వైసీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకున్నారు.