అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో రోడ్లకు ఇరువైపులా వెలసిన ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య పరిష్కరించాలని బీవైఎస్ అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్, ఆర్అండ్బీ అధికారుల దృష్టికి విషయాన్ని పలుమార్లు తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోయారు.