AKP: గొలుగొండ మండలం ఏఎల్ పురం గ్రామంలో ఆదివారం రెల్లి గర్జన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సామాజిక రెల్లి ఉప కులాల జిల్లా అధ్యక్షులు యర్రంశెట్టి అప్పనబాబు మాట్లాడుతూ.. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రెల్లిలు ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. తక్షణమే రెల్లి కులస్తులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.