GNTR: తెనాలిలోని చెంచుపేట రైతు బజార్ వద్ద నిర్వహణ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. రోడ్డు మధ్య వరకు వాహనాలు నిలపడం వలన తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సమీపంలో పాఠశాలలు ఉన్నందున ఈ ట్రాఫిక్ అడ్డంకులు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు, వ్యాపరస్థులు కోరుతున్నారు.