సత్యసాయి: కదిరి మండలంలోని ఓ గ్రామంలో వివాహితను వేధించిన మహేష్ అనే యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. మద్యం మత్తులో అతడు ఆమె ఇంటి వద్ద అసభ్యంగా ప్రవర్తించగా భర్త, బంధువులు మహేశ్‌ను స్తంభానికి కట్టేసి చితకబాదారు. సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.