టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆయన్ని అరెస్టు చేసినట్లు సీఐడీ (CID) అడిషనల్ డీజీ సంజయ్ వెల్లడించారు. చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన 24 గంటల లోగా ఆయన్ను జడ్జి ముందు హాజరు పరచాల్సి ఉంటుంది. బాబు తరఫున వాదనలు వినిపించేందుకు ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా (Siddharth Luthra) వాదనలు వినిపించనున్నారు. ఆయన సుప్రీంకోర్టు లాయర్. తన టీమ్ తో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
విజయవాడ(Vijayawada)లోని ఏబీసీ కోర్టులో సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబు తరఫున వాదనలు వినిపించనున్నారు. బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఆయన తన వాదన వినిపిస్తారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో సిద్ధార్థ్ లూథ్రా కూడా ఒకరు. దేశంలోని టాప్-10 లాయర్లలో ఆయన ఒకరు. న్యాయవర్గాల వివరాల ప్రకారం ఒకసారి కోర్టులో హాజరయ్యేందుకు ఆయన రూ.5 లక్షలు తీసుకుంటారు. రవాణా ఖర్చులు(Transportation costs), బస, ఇతర సదుపాయాలన్నీ అదనం. కేసును బట్టి గంటకు రూ.15 లక్షలవరకు తీసుకునే న్యాయవాదుల్లో ఆయన ఒకరు. అత్యంత ఖరీదైన న్యాయవాదుల్లో లూ ఒకరు కాగా.. ఢిల్లీ (Delhi) నుంచి ప్రత్యేక విమానంలో ఆయన వచ్చారు. ఢిల్లీ బయట కేసులు వాదించేందుకు రోజుకు రూ.1.50 కోట్ల వరకు ఆయనకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.