Chandra Babuకు ఓటేస్తే చేయి నరుక్కున్నట్టే.. మంత్రి ధర్మాన హాట్ కామెంట్స్
శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎవరూ చంద్రబాబుకు ఓటేయరని చెప్పారు.
Chandra Babu:ఏపీలో ఎన్నికలకు సమయం ఉంది. అప్పుడే ఎన్నికల గురించి చర్చ జరుగుతుంది. ముందస్తు ఎన్నికలు అని.. ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతాం అని సీఎం జగన్ (cm jagan) స్పష్టంచేశారు. ఇటు మంత్రి ధర్మాన ప్రసాదరావు (dharmana prasada rao) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం (srikakulam) జిల్లాలో నిర్వహించిన ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల అంశాన్ని ఆయన ప్రస్తావించారు. మహిళలు (womans) ఎవరూ చంద్రబాబుకు (chandrababu) ఓటేయరని చెప్పారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీకి (tdp) ఓటు వేస్తే.. వారి చేయ్యి వారే నరుక్కునట్టు అవుతుందని కామెంట్ చేశారు. ఎవరికీ అధికారం ఇవ్వాలన అదీ ఓటర్లకే సాధ్యం అవుతుందని చెప్పారు. తమకు అధికారం అప్పగిస్తే.. సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.
తమ ప్రభుత్వం రాకుంటే.. ఏడాది (year) తర్వాత మంచి మంచి పథకాలు ఆగిపోతాయని చెప్పారు. వచ్చే ఏడాది మే నెల తర్వాత విధిగా ఓటు వేయాలని కోరారు. మీరు ఓటు వేయడం మానేస్తే.. ఆ పథకాలు పోతాయని చెప్పారు. ఇటు ధర్మాన (dharmana) మాట్లాడుతుండగానే కొందరు మహిళలు వెళ్లిపోతున్నారు. దీంతో మంత్రి కల్పించుకున్నారు. ఓయ్ అమ్మా.. అప్పుడే వెళుతున్నారెంటే.. మీటింగ్ పూర్తవుతుంది అని చెబుతున్నారు. అంతేకాదు.. ఆటోలు తీయొద్దు.. స్టార్ట్ చేయుద్దు అని కూడా చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికను వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తిరిగి అధికారం చేపట్టాలని వైసీపీ అనుకుంటుండగా.. తమదే అధికారం అని ధీమాతో టీడీపీ ఉంది.