ASR: రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, హోం మంత్రి మంత్రి అనిత ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి మూడు జిల్లాల రెవెన్యూ సదస్సులో జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. భూ సమస్యలతో అల్లూరి జిల్లాలో చాలా మంది గిరిజనులు సంక్షేమ పధకాలకు దూరమయ్యారని మంత్రికి తెలిపారు. కావున రెవెన్యూ సదస్సులకు వచ్చే గిరిజనుల వినతులను త్వరగా పరిష్కరించాలని కిడారి కోరారు.