W.G: వృద్దులకు అభాగ్యులకు సహకారాలు అందించడం భగవత్ సేవతో సమానమని భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం తాడేరు రోడ్డులోని భీమవరం వృద్ధాశ్రమంలోని 70 మంది వృద్దులకు రాజేష్ స్టీల్స్ ఆధ్వర్యంలో రగ్గులు ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శీతాకాలంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు.