NDL: బేతంచెర్ల మండల పరిధిలోని రంగాపురం శివారులో వెలసిన వైష్ణవ పుణ్యక్షేత్రం మద్దిలేటి నరసింహ స్వామి ఆలయ అభివృద్ధికి తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరానికి చెందిన కమ్మరి బ్రహ్మయ్య ఆచారి కొడుకు కమ్మరి విష్ణు 2 లక్షల విరాళం శనివారం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. దాతలకు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక పూజలు అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.