AKP: నర్సీపట్నం శాఖ గ్రంథాలయంలో ఆదివారం గ్రంథాలయాధికారిణి దమయంతి ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేత నీతి కథలు చదివించి, అందులో నీతిని వివరించారు. రిసోర్స్ పర్సన్స్ భవాని, కృష్ణవేణిలు చరిత్రలో కొన్ని ముఖ్య సంఘటనలు వివరించారు. అనంతరం విద్యార్థులకు కేకు పంచిపెట్టారు.