KKD: లోవ దేవస్థానంలో తలుపులమ్మ తల్లిని సినీ నటుడు క్రాంతి శుక్రవారం దర్శించుకున్నారు. క్రాంతి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ అధికారులు స్వాగతం పలికారు. తాను ఏటా అమ్మవారిని దర్శిస్తానని, ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారని క్రాంతి అన్నారు. అమ్మవారిని దర్శించినవారికి మంచి జరుగుతుందన్నారు.