కృష్ణా: జిల్లాలో వరి గడ్డి ధరలు భారీగా పెరగడంతో పశుపోషకులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరా గడ్డి ధర రూ.10,000–11,000కి చేరడంతో మేత ఖర్చులు పెరిగి పాల ఉత్పత్తి తగ్గుతోంది. పరిస్థితి తట్టుకోలేక కొందరు పశువులను విక్రయించాల్సి వస్తోందని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు.