NDL: పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండల విలేఖరి రామారావుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ మద్దయ్య, బనగానపల్లె నియోజకవర్గం అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డిలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీదేవికి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.