SKLM: కొత్తూరు మండలం ఆకులతంపర గ్రామ సమీపం లో వంశధార నది వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని పలువురు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొత్తూరు తహసీల్దార్ రవిచంద్ర సోమవారం తనిఖీలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్రమంగా ఇసుక లోడింగ్ చేస్తున్న జేసీబీ,ట్రిప్పర్ లారీ లను సీజ్ చేశారు.