KDP: ఏప్రిల్ 11న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణోత్సవం సందర్భంగా 13 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని సీఐ బాబు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కడప- చెన్నై జాతీయ రహదారి ఉప్పరపల్లె పంచాయతీ సాయిబాబా గుడి సమీపంలో కారు, బస్సు, ద్విచక్ర వాహనాల తదితర వాహనాల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ చేయాలని ఆయన సూచించారు.