AKP: ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ఆదేశించారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అభివృద్ధి కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మందులకు లోటు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు.