SKLM: జీ. సిగడాం మండలం సంతవుర టికి చెందిన బీ. వెంకటేశ్వరరావు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ రైల్వే వినియోగదారుల సలహా సంఘం కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఆయన కృషి, సామాజిక సేవకు గుర్తింపుగా ఈ నియామకం లభించిందని ఎంపీ అభినందించారు.