కృష్ణా: పెడన మండలం కోప్పెర్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం నా జీవితంలో మరపురాని ఘట్టం అని, అంబేద్కర్ ఆశయాలే నా రాజకీయ మార్గదర్శకం అని వ్యాఖ్యనించారు.