కాకినాడ: దేవాదాయ శాఖలో ఉమ్మడి తూర్పుగోదావరిలో పనిచేస్తున్న ముగ్గురికి సోమవారం గ్రేడ్ వన్ పదోన్నతులు వచ్చాయి. ఇందులో కాకినాడ జిల్లాలో ఒకరు మాత్రమే ఉన్నారు. కాకినాడ అన్నదాన సమాజంలో సూపరిండెంట్‌గా పనిచేస్తున్న పీవీవీ కుమార్‌కు గ్రేడ్-1 EOగా పదోన్నతి లభించింది. ఆయనను EOల సంఘం ప్రతినిధులు సుబ్రహ్మణ్యం, మురళీ వీరభద్ర రావు, వడ్డాది సత్తిబాబు, సిబ్బంది ఘనంగా సత్కరించారు.