ATP: గార్లదిన్నె మండలం కోటంక శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయంలో ఆదివారం మాఘమాసం ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాలకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరయ్యారు ఆలయంలో స్వామి వారికి విశేషపూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అర్చకులు ఆమెను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.