CM YS Jagan: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని శ్రేణులకు సీఎం జగన్ (CM YS Jagan) దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలో గల క్యాంపు కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై పార్టీ నేతలతో సమీక్షించారు. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హాజరయ్యారు. సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు ఓ ఎత్తు.. వచ్చే 6 నెలల్లో చేయాల్సిన ప్రోగ్రామ్స్ మరో ఎత్తు అన్నారు. వచ్చే 6 నెలల ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం అన్నారు. గేర్ మార్చాల్సిన అవసరం వచ్చిందని తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని సీఎం జగన్ సూచించారు. నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలని.. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే అని తెలిపారు. టికెట్లు ఇవ్వనంత మాత్రాన నిరాశ పడొద్దని.. చాలా మందికి టికెట్లు రావొచ్చు, మరికొందరికీ రాకపోవచ్చు.. మరో అవకాశం ఇస్తాం అని సీఎం జగన్ తెలిపారు. నామినెటేడ్ పదవీ ఇచ్చి వారిని గౌరవిస్తామని పేర్కొన్నారు. టికెట్ ఇవ్వనంత మాత్రానా వారు తన వారు కాకుండా పోరని వివరించారు.
టికెట్ల అంశంపై ప్రతీ ఒక్కరు తన నిర్ణయాన్ని పెద్ద మనసుతో స్వాగతించాలని జగన్ సూచించారు. చివరి దశ సర్వే జరుగుతున్నాయని.. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపడతాం అని సీఎం జగన్ సూచించారు. ఇప్పటివరకు చేసిన పనులను.. ఇక నుంచి జనాల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఇదీ చాలా క్రుషియల్ సమయం అని నొక్కి వక్కానించారు.