విజయనగరం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 1 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు.