KDP: సదరం సర్టిఫికెట్ల జారీలో అనర్హులను తొలగించినప్పుడే అర్హులకు న్యాయం జరుగుతుందని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఇండ్ల ఓబులేసు అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. కడప రిమ్స్‌లో లంచం తీసుకున్న వైద్యుడిని తొలగించిన ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ చర్యను అభినందించారు. సదరం సర్టిఫికెట్లలో అనర్హులను గుర్తించి తొలగించాలని డిమాండ్ చేశారు.