ELR: చింతలపూడి ఐసీడీఎస్ ప్రాజెక్టు వద్ద అంగన్వాడి కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వి ఎస్ నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారిన అంగన్వాడీల బ్రతుకు మారలేదన్నారు. 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వంతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ నేటి వరకు అమలు కాలేదన్నారు. రాబోయే కాలంలో మరో సమ్మె చేస్తామన్నారు.