TPT: 11 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులను రక్షించినట్లు పాకాల పోలీసులు తెలిపారు. ఈ నెల 11 ఉ. 9 గంటల సమయంలో ఇద్దరు బాలురు ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు వారి తల్లిదండ్రులు చిన్నకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పాకాల రైల్వే స్టేషన్ పరిసరాల్లో వారు తిరుగుతుండగా గుర్తించి వారికి అప్పగించారు.