ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పీసీ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆదివారం భైరవకోన విజ్ఞాన విహారయాత్రకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు జండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు భైరవకోన యొక్క విశిష్టతను గురించి విద్యార్థులకు తెలియజేస్తామన్నారు.