SKLM: ఈ నెల 17వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు జరుగుతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. రైతు నుంచి ధాన్యం కొనుగోలు జరిగిన 48 గంటల్లో డబ్బులు చెల్లింస్తారు.