CTR: పుంగనూరు గూడూరు పల్లి గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రేపు (మంగళవారం) నిర్వహించే ముక్కోటి ఏకాదశికి సర్వం సిద్ధమైనట్లు ఆలయ అర్చకులు సురేష్ ఆచార్యులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆలయంలో ఉదయం 3 గంటలకు స్వామి వారి మూలవిరాటు అభిషేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. అనంతరం 5 గంటలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమవుతుంది అని చెప్పారు.